మన దేశంలో దాదాపు 90 శాతం మందికి ఇష్టమైన పానీయం టీ. చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగాలనే కోరిక కలుగుతుంది. కొందరైతే రోజుకు లెక్కలేనన్ని టీ సార్లు తాగుతారు.ఎందుకంటే ఇది ఒక రకమైన శక్తిని, తాజాదనాన్ని ఇస్తుంది. అందుకే తలనొప్పి, ఆందోళన ఏదైనా సరే అన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం టీ. కానీ మనం రోజూ తాగే టీలో ఉండే చక్కెర కంటెంట్ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందనే విషయం మీకు తెలుసా?నెల రోజులుగా టీ తాగకపోవడం నిజంగా టీ ప్రియులకు పెద్ద సవాలే. కానీ మీ ఆరోగ్యం దృష్ట్యా టీ తాగాలనే కోరికను అదుపు చేస్తే లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందొచ్చు. సాధారణంగా మనం తాగే టీలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది కేలరీలను పెంచుతుంది. అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీలో చక్కెర అధికంగా ఉంటే జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.కాబట్టి ఒక నెల పాటు స్వీట్ టీ తాగడం మానేస్తే, మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతుంది. అంతే కాదు అనేక రకాల ఆరోగ్య సమస్యలు మీకు దరిచేరవు. నెల పాటు స్వీట్ టీ తీసుకోకుండా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. తీపిగా ఉండే టీ తాగడం వల్ల చర్మంపై మొటిమలు, పొక్కులు ఏర్పడతాయి. కాబట్టి మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్వీట్ టీ తాగకపోవడమే మంచిది.
అలాగే నెల రోజుల పాటు టీ తాగకపోతే శరీరంలో కెఫిన్ తగ్గుతుంది. ఇది బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. నెల రోజుల పాటు స్వీట్ టీ తాగకపోతే డీహైడ్రేషన్ కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఇది సెల్-డ్యామేజింగ్ ఫ్రీ రాడికల్స్‌ను కూడా తగ్గిస్తుంది.టీ తాగే అలవాటు మానుకోవడం వల్ల గుండెల్లో మంట, తల తిరగడం, గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చేతులు వణుకుతూ ఉంటే టీ తాగడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. అలాగే టీ తాగడం మానేస్తే అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది.