జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? కడుపు ఉబ్బరంగా మారి, గ్యాస్ పెరిగిపోయిందా? అయితే మీరు మీ డైట్‌ని మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది.ఎందుకంటే కొన్ని ఫుడ్స్ ఈ సమస్యను మరింత పెంచుతాయి. కొన్ని ఫుడ్స్ సమస్యను కంట్రోల్ చేస్తాయి. పూర్తిగా ఈ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన డైట్ ఏంటి? ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
గ్యాస్ సమస్యని దూరం చేసే ఫుడ్స్
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ గ్యాస్‌ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి జీర్ణక్రియకు మంచివి.
నీటిని పుష్కలంగా తాగితే కూడా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. గ్యాస్ సమస్యను దూరం చేయడంతో పాటు.. మలబద్ధకం తగ్గుతుంది.
అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. అలాగే కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్‌ని తగ్గిస్తాయి.
పుదీనా ఆయిల్ లేదా పుదీనాతో చేసిన టీ తాగితే కండరాలు రిలాక్స్ అవుతాయి. అంతేకాకుండా జీర్ణ సమస్యలను దూరం చేసి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
యోగర్ట్ హెల్త్ గట్‌ని ప్రమోట్ చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంతో పాటు జీర్ణసమస్యలు రాకుండా కాపాడుతుంది.
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. కడుపు ఉబ్బరాన్ని కంట్రోల్లో ఉంచుతాయి.
సోంపు కూడా గట్ హెల్త్‌కి మంచిది. అందుకే భోజనం చేసిన తర్వాత దీనిని ఎక్కువమంది తీసుకుంటారు. ఇది గ్యాస్ సమస్యను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
పైనాపిల్, చమోలీ టీల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను దూరం చేసి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.
గ్యాస్‌ని తగ్గించే చిట్కాలు..
ఫుడ్‌ని ఒకేసారి కాకుండా తక్కువ తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినండి. అంటే ఎక్కువ ఫుడ్ తినమని అర్థంకాదు. మీరు రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌నే తక్కువ తక్కువగా తీసుకోవాలని అర్థం.
కార్బోనేటెడ్ డ్రింక్స్ గ్యాస్‌కు కారణమవుతాయి. ఈ విషయం తెలియక చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. పైగా వాటి వల్ల గ్యాస్ బయటకి పోతుంది అనుకుంటారు. కానీ ఉన్న గ్యాస్‌ని ఇది రెట్టింపు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
కార్బోహైడ్రెట్లు, పులియబెట్టిన(మజ్జిగ), మోనో శాచ్యూరేటెడ్ వంటివి జీర్ణ సమస్యలను పెంచుతాయి. గ్యాస్, ఉబ్బరానికి దారితీస్తాయి.
గ్యాస్ సమస్యని పెంచే ఫుడ్స్ ఇవే
పప్పులు, బీన్స్ వంటివాటిలో ఫైబర్ పుష్కలంగా ఉన్నా ఇవి కొందరిలో జీర్ణ సమస్యలను పెంచుతాయి. బ్రకోలీ, కాలీ ఫ్లవర్, క్యాబేట్ వంటివి కూడా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కొందరికి పాల ఉత్పత్తులు అంతగా పడవు. సెన్సిటివిటీని పెంచుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి. యాపిల్స్, పియర్స్, ఉల్లిపాయ కూడా కొందరిలో జీర్ణ సమస్యలను పెంచుతాయి.
గమ్స్ తినే అలవాటు మానుకోవాలి. చూయింగ్ గమ్స్ వల్ల కూడా కడుపు ఉబ్బరం పెరుగుతుంది. తినే ఆహారాన్ని స్లోగా నమిలి మింగాలి. గబగబా తింటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఈ చిట్కాలతో జీర్ణసమస్యలు కంట్రోల్ అవ్వకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి.