అవిసె నూనె అనేక ఆరోగ్య సమస్యలతో పాటు చర్మం, జుట్టు సంరక్షణలో ఉత్తమం. అవిసె గింజల నుంచి లిన్సీడ్ నూనె తీస్తారు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇతర వంట నూనెల కంటే ఈ నూనెను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులను అదుపులో ఉంచుతుంది. ఈ నూనె వాడితే ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు.