డాలరుతో పోల్చుకుంటే రూపాయి జీవన కాల కనిష్టానికి పడిపోవడం, చైనా, అమెరికా వాణిజ్య యుద్ధాలు స్టాక్ మార్కెట్ మదుపర్లను ఆందోళన పెడుతున్నాయి. మరోవైపు శుక్రవాంర ఆర్బీఐ ద్రవ్యపరపతి మీటింగ్ అంశాలు బయటకు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ పై అంశాల కారణంగా దేశీయ సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం ముగింపు (78, 271)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభనష్టాలతో దోబూచులాడుతోంది. ప్రస్తుతం ఉదయం 10:10 గంటల సమయంలో 151 పాయింట్ల నష్టంతో 78, 120 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. ప్రస్తుతం 55 పాయింట్ల నష్టంతో 23, 641 వద్ద కొనసాగుతోంది. మరోవైపు రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తోంది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి మరో 12 పైసలు తగ్గి 87.55కు పడిపోయింది.సెన్సెక్స్‌లో అబాట్ ఇండియా, మెట్రోపోలిస్, సోనా బీఎల్‌డబ్ల్యూ, అల్కమ్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్, మాక్రోటెక్ డెవలపర్స్, బీఎస్‌ఈ లిమిటెడ్, మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 92 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో ఉంది.
![]() |
![]() |