ఆగ్రాలోని ట్రాన్స్ యమునా PS పరిధిలో ఫిబ్రవరి 1న దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు ఒక ఇంట్లోకి ప్రవేశించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు భర్తను కొట్టి.. పట్టుకున్నారు.
అనంతరం ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేసి వీడియోలు తీసి బెదిరించారు. తన భార్యను వదిలేయమని ఎంత వేడుకున్నా వదల్లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.