వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చాలని కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్సీపీలో కీలక నాయకుడిగా ఉన్న పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఈనాడు పత్రిక పనిగట్టుకుని విషం చిమ్ముతోందని ఆయన ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పడి ఏడ్వటం ఈనాడుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలను భూమన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...... డి.పట్టాభూములు, ప్రీహోల్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తప్పుడు కథనాలు రాయడం ఈనాడు పత్రిక పనిగా పెట్టుకుందని భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నెలల క్రితం మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టారు అంటూ ప్రచురించిన ఈనాడు.. ఇప్పుడు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. పచ్చి అబద్ధాలతో కూడిన వార్తలు రాస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు బాకా ఊదడం కోసమే పార్టీ పత్రికగా ఈనాడు మిగిలిపోయిందని భూమన విమర్శించారు.
![]() |
![]() |