వైసీపీలో విలువలు ఉండవు.. అది ఒక దుర్మార్గపు పార్టీ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధ్వజమెత్తారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ వైసీపీలో చేరడంపై ఆయన స్పందించారు. ‘‘పార్టీలో చేరేటప్పుడు ఆప్యాయంగా మాట్లాడతారు. ఆ తర్వాత రాజకీయంగా అత్యాచారం చేస్తారు. ఇప్పటికే ఆ పార్టీలో చేరిన 74మంది దళితుల విషయంలో అదే జరిగింది. అభ్యుదయ భావాలు కలిగిన శైలజానాథ్ దళిత వ్యతిరేక భావాలు కలిగిన వైసీపీలో చేరడం బాధాకరం’’ అని అన్నారు. వైసీపీ నేతలు మొదట మనిషిలా మాట్లాడతారని... ఆ తర్వాత చంపి తినేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్న ఆంధ్రా శశికళకు దళితులు అంటే అసలు పడదన్నారు. గతంలో తాను కూడా వైసీపీ వారి మాటలు విని ఆ పార్టీలో చేరి మోసపోయానని డొక్కా ఆవేదన వ్యక్తం చేశారు.
![]() |
![]() |