హెయిర్ ఫాల్ సమస్యకు మందార పువ్వు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. అవును మందార పువ్వును ఉపయోగించి వెంట్రుకలు ఊడిపోకుండా చేయొచ్చు. అలాగే మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా, తెల్లవెంట్రుకలు రాకుండా నివారించడంలో మందార బెస్ట్ మెడిసిన్ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే, మందార పువ్వు జుట్టుకు మాత్రమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా. మందార పువ్వులలో ఇనుము పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని రక్తహీనతను దూరం చేస్తుంది. మందార మొగ్గలను రుబ్బి దాని రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనితో పాటు, మందార పువ్వులు తినడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే, మందార ఆకుల టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
మందార పువ్వులో పెద్ద మొత్తంలో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వయసు పైబడినా సంకేతాలు కనిపించకుండా చేసి మీ అందాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుంది. మందారం వాడకంతో మనం ఫ్రీ రాడికల్స్ నుండి కూడా ఉపశమనం పొందుతాము. హైబిస్కస్ టీ తాగడం వల్ల అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండే మందార ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తరచుగా జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతున్నవారికి మందారం టీతో ఉపశమనం లభిస్తుంది. మందారం పూలతో గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. మందార పువ్వు ఆకులు జుట్టును మందంగా, మృదువుగా, మెరిసేలా చేస్తాయి. దీని ఆకులతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ జుట్టును పొడవుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
![]() |
![]() |