అహ్మదాబాద్ వేదికగా బుధవారం భారత్-ఇంగ్లండ్‌ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చైర్మన్ జై షా(Jay Shah) కీలక ప్రకటన చేశారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో తాము అవయవదానాన్ని ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ‘అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ అనే థీమ్‌తో ముందుకువస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాన్ని బీసీసీఐ చేపడుతోంది.‘‘ప్రజలకు స్ఫూర్తినిచ్చి వారిని ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది. కాబట్టి దీనిద్వారా అవయవ దానం విషయంలో ముందడుగు వేయాలని.. ప్రజలను చైతన్యపరచాలని అనుకుంటున్నాము. ప్రపంచంలో ఇతరులకు ఇచ్చే గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వడం మాత్రమే’’ అని జైషా పేర్కొన్నారు. మనం తీసుకునే ఒక నిర్ణయం ఎన్నో ప్రాణాలు కాపాడగలదని.. దీనికోసం అందరం కలిసి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు.
![]() |
![]() |