ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలలో ఇంకా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయకపోవడంపైనా అసహనాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను మార్చి4కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వాజ్యాన్ని అనుమతించి సుప్రీం కోర్టు ఈరోజు (సోమవారం) విచారణ చేపట్టింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్‌మోహన్‌ల ధర్మాసనం విచారణ జరిగింది.
![]() |
![]() |