పాకిస్తాన్లో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై సఫారీ ఆటగాడు సౌతాఫ్రికా ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కీ తన తొలి మ్యాచ్‌లోనే 150 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వన్డే అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగిన సఫారీ జట్టులో స్మిత్ 41, వియాన్ ముల్టర్ 64 పరుగులు చేసి రాణించారు. డెబ్యూ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీ 148 బంతుల్లో 150 పరుగులు చేసి తన సత్తా చాటాడు.
అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రీట్జ్కీ 150 పరుగులతో తొలి స్థానంలో నిలిచాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు డెస్మండ్ హేన్స్ ఇప్పటి వరకు 148 పరుగులతో టాప్ ప్లేస్‌లో ఉండగా ఆ రికార్డును బ్రీట్జ్కీ బద్దలుకొట్టాడు. ఇక వన్డే డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లలో బ్రీట్జ్కీ నాలుగో ప్లేయర్. కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపై, టెంబా బవుమా 2016లో ఐర్లాండ్‌పై, రీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపై సెంచరీలు నమోదు చేశారు.
సౌతాఫ్రికా ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కీకి ముందు వన్డే డెబ్యూ మ్యాచ్‌లలో సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీళ్లే. డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాక్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆసీస్), లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (భారత్), బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హక్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాక్), రహ్మానుల్లా గుర్భాజ్ (అప్ఘనిస్తాన్), ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (విండీస్).
![]() |
![]() |