కాకరకాయ రసంతో చుండ్రు సమస్యలకు చెక్ చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. కాకరకాయలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి9, పొటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.చుండ్రు సమస్యను దూరం చేసుకోవాలంటే కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. అనంతరం దీన్ని కాకర రసంలో కలిపి కుదుళ్లకు పట్టించాలి. కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.కాలుష్యం, పోషకాహార లోపం, వాతావరణ మార్పుల కారణంగా.. చుండ్రు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. చుండ్రు సమస్యకు చెక్ పెట్టడానికి.. కాకార రసంలో జీలకర్రపొడి వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మాడుకు అప్లై చేసుకోండి. దీన్ని 15 నిమిషాలు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేస్తే.. చుండ్రు మాయం అవుతుంది.
![]() |
![]() |