ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల కారణంగా చాలామంది రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. వాటిలో హైబీపీ, లోబీపి ప్రధానమైనవి. మనం తరచూ హైబీపి గురించి వింటూనే ఉంటాం. హైబీపి ఆరోగ్యానికి ఏ విధంగా మంచిది కాదో.. బీపి తక్కువ ఉండటం కూడా పెద్ద సమస్యే. సాధారణ బీపి 120/80 mmHg. అదే 90/80 mmHg కన్నా తక్కువైతే అది లో బీపిగా పరిగణిస్తారు. లో బీపి కూడా చాలా సమస్యలకు దారితీస్తుంది. బీపి తక్కువగా ఉంటే తలతిరగడం, మైకం, చూపు మసకబారడం, వికారం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, బలహీనత లాంటి సమస్యలు వస్తాయి. తక్కువ బిపి ఉన్నవారు తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా తక్కువ బిపిని సులభంగా నియంత్రించవచ్చు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం. బీట్రూట్‌లో ఉండే నైట్రేట్ రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బీట్ రూట్‌ను డైరెక్ట్ గా లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ తినడం అందరికీ మంచిది కాదు. కానీ తక్కువ బిపి ఉన్నవారు కాస్త ఎక్కువ ఉప్పు తీసుకోవచ్చు. ఉప్పు నీరు తాగడం వల్ల కూడా బిపి పెరుగుతుంది. కాఫీ తాత్కాలికంగా బీపిని పెంచుతుంది. తక్కువ బీపి ఉన్నవారు టీ, కాఫీ లేదా కూల్ డ్రింక్స్ తాగవచ్చు. గింజలు, విత్తనాలలో ప్రోటీన్, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపిని నియంత్రిస్తాయి. బాదం, వాల్‌నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలు లాంటివి తినడం మంచిది. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే బీపిని నియంత్రించవచ్చు.
![]() |
![]() |