డాలర్ వేటలో భారతీయుల కల చెదిరింది. కన్నీరే మిగిలింది. తమ కలలను సాకారం చేసుకోవడానికి, కుటుంబం, పిల్లలకు అందమైన భవిష్యత్ ఇవ్వడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అమెరికాకు వెళ్లే విషయంలో మాత్రం వెనుకడుగువేయట్లేరు. అక్కడ అనధికారికంగా, అమెరికన్లు చేయని పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఏ రోజు దొరికిపోతామో తెలియక భయంతో అనుక్షణం నరకయాతన పడుతున్నారు.డోనల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 'అక్రమ వలసదారుల' ఏరివేతపై అమెరికావ్యాప్తంగా చర్యలు ప్రారంభించారు. గత శుక్రవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో కనిపించిన దృశ్యాలు కూడా దీని ఫలితమే.అమెరికా నుంచి ఎవరిని బహిష్కరిస్తున్నారనే దానిపై మైగ్రేషన్ పాలసీ రిపోర్టు కొన్ని వివరాలు వెల్లడించింది.అమెరికాలోని అనధికార వలసదారులను మాత్రమే బహిష్కరిస్తారని చాలామంది భావిస్తున్నారు.అయితే, దేశంలో చట్టబద్ధంగా నివసిస్తూ సిటిజన్షిప్ పొందని వలసదారులు కూడా కొన్ని పరిస్థితులలో బహిష్కరణకు గురికావొచ్చు. అనధికారిక వలసదారులు, అక్రమంగా అమెరికా సరిహద్దులోకి ప్రవేశించినవారు, వీసాల గడువు దాటినా దేశంలోనే ఉంటున్న వ్యక్తులను కూడా వారివారి దేశాలకు తిప్పి పంపవచ్చు.
![]() |
![]() |