మాసాలన్నింటిలోకి మాఘమాసం విశిష్టమైనది. రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను కొలుచుకునేందుకు పర్వదినాలను అందించే మాసం ఇది. మాఘపౌర్ణమి వచ్చిందంటే పుణ్య తీర్థాలన్నీ కళకళలాడుతాయి. స్నానాల్లోకెల్లా మాఘస్నానం ఉత్తమమని పెద్దలు చెబుతూ ఉంటారు. సూర్యుడి తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్లే.. మాఘస్నానానికి సాటి వచ్చే కృతువు గాని, క్రియ గాని మరొకటి లేదని శాస్త్ర వచనం. ఈ నేపథ్యంలో పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లి సముద్రాల్లో, నదుల్లో స్నానాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన పలువురు కాశీలోని గంగా నదిలో మాఘ పౌర్ణమి సందర్భంగా స్నానాలు చేశారు.
![]() |
![]() |