జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్ కూడా ఉన్నారు.ఎర్నాకుళం జిల్లాలోని కురీకాడ్‌లో అగస్త్య ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయం వేద జ్ఞానం, ఆయుర్వేద వైద్యానికి నిలయం. ఈ ఆలయ సముదాయంలో మొత్తం 13 చిన్న మందిరాలు ఉన్నాయి. వీటి అన్నింటినీ కలిపి అగస్త్యాశ్రమం అని పిలుస్తారు. ప్రధాన మందిరంలో అగస్త్య మహర్షి ప్రతిమ ఉంటుంది. ఇక్కడ రుషులు, సాధువులు ఎక్కువగా ఉంటారు. అగస్త్య మహర్షి ఆలయంలో విగ్రహాలకు అభిషేకం చేయడానికి పాలు, నెయ్యికి బదులుగా ఔషధ మొక్కల రసాలను ఉపయోగిస్తారు. అలాగే ఔషధ మొక్కలతో చేసిన దండలను విగ్రహాలకు అలంకరిస్తారు. అగస్త్య మహర్షి ఆలయంలో ప్రసాదంగా భక్తులకు చక్కెరలతో చేసిన ప్రసాదం బదులుగా ఆరోగ్యకరమైన మూలికలతో తయారు చేసిన ప్రసాదాన్ని అందజేస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. మూడు రోజుల పర్యటనలో అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర, స్వామిమలైయ్, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ వెళ్లనున్నారు.
![]() |
![]() |