గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. ఇదివరకటి రోజుల్లో గంజిని సూప్‌లా తీసుకునేవారు. కానీ, రాన్రాను అది తగ్గింది. పారబోయడం, చెట్లకి పోయడం, ఇతర పనులకి వాడుతున్నారు. కానీ, వీటిని కూడా మనం రోజువారీ వంటల్లో వాడుకోవచ్చు. వాటిలోని గుణాలను పొందొచ్చు.
వీటివల్ల వంటలకి రుచి పెరుగుతుంది. పైగా పోషకాలన్నీ అందుకున్నవారవుతారు. కొంచెం ఆలోచించి మనం రోజూ ఈ నీటిని వంటల్లో పోసి వండొచ్చు. దీంతో వంటలకి రుచి పెరుగుతుంది.
సాస్, గ్రేవీస్
సాసెస్, గ్రేవీస్ చేసినప్పుడు ఈ నీటితో చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. ఇందులోని స్టార్చ్ వంటలకి సిల్కీ టెక్చర్‌ని ఇవ్వడమే కాకుండా ఎక్స్‌ట్రా థిక్‌నెస్‌ని యాడ్ చేస్తుంది. కాబట్టి, హ్యాపీగా వాడుకోవచ్చు.
స్మూతీస్
మనం స్మూతీస్ చేసుకునేటప్పుడు వాటిలో నీటిని పోసి గ్రైండ్ చేస్తుంటాం. అలా కాకుండా బియ్యం నీటిని పోసి గ్రైండ్ చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ మనకి అందుతాయి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పండ్లు, ఆకుకూరలని ఈ బియ్యం నీటితో మిక్సీ పట్టి తాగడం వల్ల హెల్దీ డ్రింక్ తాగినవారవుతారు.
బేకింగ్
బేక్ చేసేటప్పుడు చాలా మంది నీరు లేదా పాలని వాడతారు. అలాంటప్పుడు కొన్ని సార్లు ఈ నీటిని కూడా వాడొచ్చు. బియ్యంలోని స్టార్చ్ కారణంగా బేక్ చేసిన ఫుడ్ టెక్చర్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. దీని వల్ల బేకింగ్ ఫుడ్స్ సాఫ్ట్, ఫ్లఫీగా కూడా వస్తాయి.
ఉడికించేందుకు
సాధారణంగా మనం ఇళ్లలో క్వినోవా, ఇతర గ్రెయిన్స్‌ని ఉడికిస్తుంటాం. అలాంటప్పుడు నార్మల్ నీరు పోస్తుంటారు. అలా కాకుండా ఓ సారి ఈ గంజినీటిని పోసి ఉడికించండి. దీని వల్ల టెక్చర్, టేస్ట్ చాలా బాగా పెరుగుతుంది. రెగ్యులర్‌గా వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కూరల్ని ఉడికించేందుకు కూడా ఈ నీటిని వాడొచ్చు. దీని వల్ల కూడా కూరల రుచి పెరుగుతుంది.
సూప్స్
ఈ రైస్ వాటర్‌ని మనం మంచి సూప్స్‌లా తయారుచేసుకోవచ్చు. మీరు వేరే ఇతర సూప్స్ చేసినప్పుడు అందులో ఈ నీరు పోయండి. దీంతో రుచి పెరుగుతుంది. చికెన్ నూడుల్స్ సూప్స్, వెజిటేబుల్ సూప్స్ ఇలా వేటికైనా ఈ నీటితో వండి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ నీటితో ఓట్స్ వంటివి వండితే చాలా మంచిది. దీని వల్ల ఓట్స్ రుచి బాగుంటుంది. పోషకాలు కూడా అందుతాయి.
వాడే ముందు
అయితే ఈ నీటిని వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటేగంజినీటిని బాగా వడపోయాలి.మొత్తం గంజినీటితోనే కాకుండా కొద్దిగా యాడ్ చేయాలి. లేదంటే వంటల రుచి పూర్తిగా మారిపోతుంది. స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. తాజా బియ్యం నీటిని వాడడం వల్ల టేస్ట్ బాగుంటుంది.
![]() |
![]() |