1)మేషరాశి.... (అశ్విని, భరణి, కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
వారం ప్రారంభంలోరోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అనుకున్న విషయాలు శ్రమతో కొంతమేర సత్ఫలితాలు నిస్తాయి.ఉన్నత వ్యక్తులని కలుస్తారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు. మీ ఆలోచనలు బాగుంటాయి సృజనాత్మకత బాగుంటుంది. ఇంతకుముందు రుణములు తీసుకున్న వారి చెల్లిస్తారు. సంతానము తో, ఆత్మీయ వ్యక్తులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. వారం మధ్యలో భాగస్వామ్య సంబంధాలు ఇబ్బంది పెట్టకుండా, అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన అంశములలో, సామాజిక సంబంధాలలో వైరాగ్య భావనల అధికంగా ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. భాగస్వామి వృత్తిపరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ, ఆరోగ్య విషయంలోప్రత్యేకశ్రద్ధతీసుకోవాలి. వారము చివరిలో ఆకస్మిక వాగ్వాదములకు దూరంగా ఉండాలి. సొంత ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి. ప్రయాణాలు ముఖ్య విషయాలలో కొంత ఆటంకాలు వాయిదా ఇబ్బంది కలిగిస్తాయి. ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయాలి. వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి. ఇష్టం లేని వార్తలు, ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. అన్నిటినీ అధిగమించడానికి శుభ ఫలితాలు కొరకు శ్రీరామ జయ రామ జయజయ రామ శ్లోకము మేలు.
2) వృషభరాశి...(కృతిక 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర 1,2 పాదాలు)(నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ,వె,వో)
వారము ప్రారంభంఆలోచనలు ఉద్వేగ పూరితంగా ఉన్నప్పటికీ ఫలవంతంగా ఉంటాయి. ఆకస్మిక బహుమానాలు అందుకుంటారు, భాగస్వామి కి సంబంధించి కొత్త నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. సంతాన విద్య అభివృద్ధికి సంబంధించిన విషయాలు వింటారు. గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విందు వినోదాలతో, ఆహ్లాదకరంగా సంతోషంగా స్నేహితులతో బంధుమిత్రులతో ప్రారంభమవుతుంది. వారం మధ్యలో వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ, నూతన బాధ్యతలు, పోటీలలో విజయం కొరకు చేయి ప్రయత్నాలు, పూర్వరుణాలుచెల్లిస్తారు, బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు.. రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.మీ కుటుంబములోని పెద్దలు తీర్థయాత్రలు చేయడానికి సంకల్పిస్తారు.వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది, గుర్తింపు గౌరవం శ్రమకు తగ్గిన ప్రతిఫలాన్ని పొందుతారు. శుభఫలితముల కొరకు ఆదిత్య హృదయ శ్రవణము మంచిది.
3) మిధున రాశి...(మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
వారం ప్రారంభంలో విద్యార్థులు విద్యాపరమైన అంశములు మీద శ్రద్ధను పెంచుకోవాలి. వ్యవసాయ అంశములు అనుకూలంగా ఉంటాయి.తల్లి ఆరోగ్య ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. వాహనము కొరకు, గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాలలో తోబుట్టువులకు నూతన అవకాశములు. మీ సహకారం ఉంటుంది వారికి.వారం మధ్యలో స్నేహితులతో అభిప్రాయ బేధం రాకుండా జాగ్రత్త పడాలి. సంతానమునకు విద్యాపరంగా అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. ఎంతోకాలం ఎదురుచూస్తున్న దూర ప్రదేశంలో నుంచి అందుకున్న ఒక వార్త ఆనందాన్నిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తారు.అధిక శ్రమ బాధ్యతలు ఉన్నప్పటికీ గుర్తింపు గౌరవాన్ని పెంచుకుంటారు. వృత్తిలో బాధ్యతాయుతమైన వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు.ఉపాసన బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఫలితముల కొరకు శ్రీకృష్ణ మందిరములు దర్శించుట మేలు
4) కర్కాటక రాశి.(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ,డే, డో)
వారం ప్రారంభంలోమిత్రులతో సన్నిహితులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు.కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు.మిత్రుల సహకారం ఆశించిన విధముగా అనుకూలంగా ఉంటుంది ధైర్యము, పరాక్రమం పెరుగుతుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆదాయ వనరులు మిశ్రమముగా ఉంటుంది. వారము మధ్యలో గృహ వాతావరణం, ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి. గృహ వాహన సంబంధ అంశములలో చిన్నపాటి రిపేర్లకు మరమ్మతులకు అవకాశం. వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉన్నప్పటికీ మీరు సమయానికి మీ పని పూర్తి చేసుకున్నట్లయితే ఉన్నత అధికారుల ప్రశంసలను పొందుతారు. ఒత్తిడి దానివలన వృత్తిపరమైన అలసట, అనారోగ్య భావనలు. సమయానికి విశ్రాంతి ఆహార స్వీకరణ మేలు. వృత్తిలో కొత్త వ్యక్తుల జోక్యం కొంత అశాంతి కలిగించినప్పటికీ చూసి చూడనట్లు ముందుకు వెళ్లడం మంచిది. ఇష్టమైన వారి కోసం అధికంగా ఖర్చు చేస్తారు. సంతానం యొక్క విద్య మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. మరిన్ని శుభ ఫలితాలు కొరకు విష్ణు సహస్రనామ శ్రవణము మంచిది.
5) సింహరాశి...(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
వారం ప్రారంభంలోయదార్థవాది బంధు విరోధి అన్నట్లుగా మాట్లాడే మాట నిక్కచ్చిగా ఉండటం వల్ల కొందరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొన్ని పనులలో, ఆర్థిక సంబంధమైన అంశాలలో ఆటంకాలు ఆలస్యాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్లే ప్రయత్నాలు. మాట విలువ గౌరవం పెరుగుతుంది నూతన వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలాకాలంగా చూస్తున్న రావలసిన ఆదాయమును అందుకుంటారు. సంతాన అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. వారి కొరకు సమయాన్ని కేటాయిస్తారు. వారం మధ్యలో కుటుంబంలోని వ్యక్తుల ప్రోత్సాహం, ముఖ్యంగా సోదరి వర్గం యొక్క సహకారం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేయడము లో చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్వగ్రామం సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తారు.దూరప్రయాణాలకొరకుప్రణాళికలువేసుకుంటారు.ఆధ్యాత్మిక వ్యక్తుల సహకారం, పెద్దల ఆశీస్సులు అనుకూలంగా ఉంటాయి. మరిన్ని శుభ ఫలితాలు కొరకు సుబ్రమణ్య స్వామి ఆరాధన మంచిది.
6)కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4 పాదాలు, హస్త 4వ పాదం, చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో , పా, పి, పూ , షం , ణా, పే,పో)
వారం ప్రారంభ భాగస్వామితో కలిపి నూతన నిర్ణయాలు తీసుకుంటారుఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది.ఆరోగ్యం బాగుంటుంది. మనసులోని కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారుశారీరక శ్రద్ధ, అలంకరణమీద ఆసక్తి పెరుగుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. దూర ప్రయాణానికి సంకల్పం చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి.కుటుంబ ఆదాయంలో కొంత ఆటంకాలు ఉంటాయి, కన్ను మరియు పన్ను వంటిఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల్ని సంప్రదించాలి. వ్యక్తిగత సంతోషం కొరకు పెడుతున్న ఖర్చులు అధికమైనప్పటికీ ఆనందాన్నిస్తాయి. .వ్యక్తిగత అంశములలో తీసుకొని నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయిఅనుకూలిస్తాయి.దగ్గరప్రయాణాలుచేస్తారు,ఆత్మీయులుసహకరిస్తారు,కమ్యూనికేషను బాగుంటుంది, సోదరీమణులతో కలిసి సమయాన్ని వెచ్చిస్తారు.ఇతరులకు రుణములు ఇస్తారు. సంతానపరమైన అంశములలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆలోచన రేకెత్తి స్థాయి. గృహ ఆదాయం బాగుంటుంది. తల్లితరపు బంధువులనుంచిరాకపోకలుంటాయి నూతన వాహన కొనుగోలు కొరకు తోబుట్టువులతో సంప్రదిస్తారు. మరిన్ని శుభ ఫలితాల కొరకు దత్తాత్రేయ ఆరాధన మంచిది.
7)తులారాశి...(చిత్త 3 4 పాదాలు, స్వాతి, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
ప్రారంభం ఆధ్యాత్మిక ఆలోచనలతో , క్షేత్ర సందర్శన పుణ్యస్నానాలతో స్వాగతం పలుకుతారు.అధిక ఖర్చులతో మొదలైనప్పటికీ అవి ఉపయోగకరంగా ఉంటాయి. ఆత్మసంతృప్తిని వ్యక్తిగత అభివృద్ధిని కలిగిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. లాభాలు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగము కాకుండా అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నములు చేయాలి. కుటుంబంలో భాగస్వామితో అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మాట పట్టింపులు లేకుండా, వాగ్వాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి. వారము మధ్యలో ప్రతి విషయంలోనూ మానసికంగా ఆందోళన, వైరాగ్యంగా ఆలోచనలు ఉన్నప్పటికీ అధిగమించే ప్రయత్నం చేయాలి. సంతానము అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు.కుటుంబ సఖ్యత. కుటుంబ వ్యక్తులకు సంబంధించి ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆదాయం బాగుంటుంది, మాట విలువ పెరుగుతుంది. వ్యవసాయ సంబంధ అంశములు మీద దృష్టి పెడతారు. మరిన్ని మంచి ఫలితముల కొరకు హనుమాన్ చాలీసా పారాయణ చాలా మంచిది.
8)వృశ్చిక రాశి...(విశాఖ 4వ పాదం, అనురాధ, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
ప్రారంభం చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సాహంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు.కుటుంబ సభ్యులతో సంతానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, వృత్తిలో ఆశించిన స్థానాన్ని పొందటానికి అధిక శ్రమ పడతారు. తగిన గుర్తింపు పొందుతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతోషంగా శుభవార్తలతో వృత్తిపరమైన అభివృద్ధితో మొదలవుతుంది. తండ్రి,పెద్దలు నుంచి, దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు.నూతన విషయాలు తెలుసుకుంటారు వృత్తిలో గౌరవం, ఆదాయపరమైన పెరుగుదల, ఆశించిన ప్రదేశములకు స్థానచలనమునకు ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం ఆనందాన్ని స్థాయి.మధ్యలో వృత్తిపరంగా నూతన బాధ్యతలు ప్రయాణాలు, కొత్త వ్యక్తుల కలయిక, శ్రమ బడలిక ఉన్నప్పటికీ చలాకీగా వాటిని అధిగమిస్తారు. ఆధ్యాత్మిక పుణ్య క్షేత్ర సందర్శనతో, నదీ స్నానాలు, గురువులను కలవడం వారి ఆశీస్సులు తీసుకోవడం, కొత్త ప్రదేశాలకు విరాళాలు ఇవ్వడం. సమయానికి నిద్ర, ఆహార స్వీకరణ అవసరం. చివరిలో వ్యక్తిగత గౌరవము శ్రద్ధ పెరుగుతాయి
మరిన్ని శుభ ఫలితముల కొరకు సూర్య నమస్కారములు మంచిది
9)ధను రాశి...(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
వారం ప్రారంభంలో వృత్తికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి,నూతన అవకాశముల కొరకు సహకారం కొరకు రాజకీయ నాయకుల్ని పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలిసి చర్చలు సాగిస్తారు. సంతాన సంబంధ విద్యా ఆరోగ్య అభివృద్ధి అంశములలో కొన్నిఉద్వేగాలకు లోనవుతారు. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. సమయమునకు తగిన ఆహార స్వీకరణ అవసరము.వృత్తిపరంగా మీ పై ఉన్న ఉన్నత అధికారుల సహకారంతో పనులు నెరవేరుస్తారు. భూమికి సంబంధించిన అంశములలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది.వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇతరులకు సహకరిస్తారు. తోబుట్టువులతో నిదానమవసరం. నూతన బాధ్యతలు అధికముగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడతారు. వారం మధ్యలో ఒక వార్త ఘర్షణతో కూడిన ఆనందాన్నిస్తుంది. మిత్రులతో సన్నిహితులతో కలిసి చర్చిస్తారు. ఆత్మీయుల సహకారంతో కోరుకున్న విషయంలో పనులు ముందుకు సాగుతాయి. భాగస్వామి సంబంధ అంశాలు ఒక్కలికి వస్తాయి. శుభముల కొరకు సత్యనారాయణ స్వామి దేవాలయ సందర్శన మంచిది.
10) మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భో , జా , జి, ఖి,ఖు, ఖే,ఖో, గా, గి)
వారం ప్రారంభం కుటుంబంలోని పెద్దలు, పూర్వ గురువుల ఆశీస్సులతో ముందుకు సాగుతారు. ఆత్మీయ వ్యక్తుల సహకారం మీకు మనో ధైర్యము ఇస్తుంది.విద్యా పరంగా అభివృద్ధి పరంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నం చేయువారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానానికి అభివృద్ధి కరంగా, విదేశీ పరమైన విద్యకి అవకాశంగా సూచనలు ఉన్నాయి.అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, అవి సంతోషాన్ని , ఉపయోగపడ్డాన్ని సూచిస్తున్నాయి. మధ్యలో వృత్తిపరంగా కొంత అధిక శ్రమకు, అపార్థములకు, నూతన బాధ్యతలకు అవకాశము ఉంది. వృత్తిపరమైన వైరాగ్యంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తిపరముగా సంబంధం లేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి. వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మిక లాభములు, నూతన విషయాలు ఆనందాన్ని ఇవ్వడం, సంతానం అభివృద్ధి.నూతన గృహ వాహన కొనుగోలు అంశములలో ఆచితూచి అడుగు వేయాలి. చివరిలో వ్యక్తిగత గౌరవం పెరగడం,శుభ ఫలితాలు కొరకు దుర్గాదేవి ఆలయ సందర్శన మంచిది
11) కుంభ రాశి...(ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ,గే, గో,సా,సి, సు, సే, సో, దా)
వారం ప్రారంభంలో ప్రయాణాలలో అనుకోని ఆటంకములు, చికాకులు, ఇబ్బంది కలిగించినప్పటికీ ఆత్మ బలముతో వాటిని జయిస్తారు.ఆరోగ్యం పై శ్రద్ధ అవసరము.నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. అగ్రిమెంట్లు చేసేటప్పుడు, సంతకాలు చేసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు అవసరం, తోబుట్టువులతో ఆత్మీయులతో చర్చలు జరిపేటప్పుడు విభేదాలు రాకుండా వీలైనంతవరకూ మౌనం పాటించటమేలు.ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకి అవకాశం ఉంది. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. వారం మధ్యలో భాగస్వామికి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటారు. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. పెద్దల ఆశీర్వచనం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనందాన్నిస్తుంది. వారం చివరిలో భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి. కళా రంగంలో ఉండే వారికి అనుకూలంగా ఉంటుంద. ఖరీదైన వాహన కొనుగోలు కొరకు చేయు ప్రయత్నాలు ముందుకు వెళతాయి. రుణములు ఇచ్చే ముందు ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఆత్మీయ మిత్రుల సహకారాన్ని కోరుకుంటారు. శుభ ఫలితాలు కొరకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన మంచిది
12) మీన రాశి...(పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభంలోజీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సంబంధ ప్రయాణాలు, దేవాలయ సందర్శన,నదీ స్నానాలు మొదలైన వాటి గురించి అనుకూలమైన చర్చలు చేస్తారు. కుటుంబము ఆహ్లాదకరంగా ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆత్మీయ సోదర వర్గం సహకారం అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఆకస్మిక ఖర్చులు చికాకులు కలిగిస్తాయి. దీర్ఘకాలికి పెట్టుబడులు పైన ఆసక్తి ఉండదు. మాటల విషయంలో కంటి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పనులలో ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి. చివరిలో తండ్రి సహకారము ఉంటుంది. సమాజ సేవ చేస్తారు ఆదాయపరంగా బాగుంటుంది.ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి, కొత్త వ్యక్తులన్నీ తొందరపాటు గా నమ్మడంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాలు అనుకూలం.
శుభ ఫలితాల కొరకు నవగ్రహ దేవాలయ సందర్శన మంచిది
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
డా|| ఈడుపుగంటి పద్మజారాణి
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు
email : padma.suryapaper@gmail.com
phone : +91 93930 07560, +91 98492 50852
www.padmamukhi.com
![]() |
![]() |