రాజధాని అమరావతి పనులకు ఏప్రిల్ మూడు, నాలుగు వారాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు అమరావతికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణ కార్యక్రమ పర్యటనకు మోదీ తప్పకుండా వస్తారని చెబుతున్నారు. అయితే, ఇంతవరకు ఎవరూ ధ్రువీకరించలేదు. విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015, అక్టోబరు 22న అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, డీజీపీ కార్యాలయాలను ప్రభుత్వం పూర్తిచేసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి విధ్వంసం జరగడమే కాకుండా, రాజధానిని అటకెక్కించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.
![]() |
![]() |