జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘జనసేవా నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత పవన్ కల్యాణ్‌కు, పార్టీ నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ ఎక్స్‌లో స్పందిస్తూ... ‘అన్న పవన్ కల్యాణ్‌కు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనసేన కృషి శ్లాఘనీయం. రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తూ, ప్రగతి దిశగా నడిపించడంలో, అందరికీ మెరుగైన భవిష్యత్ ఇవ్వడంలో వారి కృషి నిస్సందేహమైనది’ అని పేర్కొన్నారు.
![]() |
![]() |