హైరిటర్స్ కోరుకునే వారు ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే, అందరికీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రాదు. అలాంటి వారందరూ ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారు. ఈక్విటీల్లో ఈజీగా పెట్టుబడులు పెట్టే అవకాశం లభించడం, హైరిటర్న్స్ వస్తుండడమే ఇందుకు కారణం. అలాగే ఇందులో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వారితో పాటు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారు సైతం కొత్త ఫండ్ల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారందరికీ అలర్ట్. దిగ్గజ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఎస్బీఐ మ్యూచవల్ ఫండ్స్ ఈసారి రెండు కొత్త ఫండ్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎస్బీఐ బీఎస్ఈ పీఎస్యూ బ్యాంక్ ఈటీఎఫ్
ఎస్బీఐ మ్యూచవల్ ఫండ్స్ నుంచి ఎస్బీఐ బీఎస్ఈ పీఎస్యూ బ్యాంక్ ఈటీఎఫ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ పథకం సబ్స్క్రిప్షన్ మార్చి 17వ తేదీ ప్రారంభమవుతుంది. యూనిట్ల కోసం బిడ్లు దాఖలు చేసేందుకు మార్చి 20 వరకు అవకాశం ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు. సబ్స్క్రిప్షన్ పూర్తయిన తర్వాత యూనిట్ల కేటాయింపు ఉంటుంది.
ఎస్బీఐ బీఎస్ఈ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్
ఎస్బీఐ మ్యూచవల్ ఫండ్స్ నుంచి మరో కొత్త పథకం వస్తోంది. అదే ఎస్బీఐ బీఎస్ఈ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ . ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ మార్చి 17వ తేదీన మొదలవుతోంది. మార్చి 20వ తేదీ వరకు యూనిట్ల కొనుగోలుకు అవకాశం ఉంటుంది. ఇందులోనూ కనీస పెట్టుబడి విలువ రూ.5 వేలుగా ఉంది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఈ కథనం కేవలం సమాచారం కోసమే. మ్యూచవల్ ఫండ్ పెట్టుబడులు సైతం హైరిస్క్ కలిగి ఉంటాయి. ఏఎంసీల గత చరిత్ర చూసి గుడ్డిగా ఇన్వెస్ట్ చేయకూడదు. ఈక్విటీ నిపుణుల సలహాలు తీసుకుని సరైన ఫండ్ ఎంచుకుని డబ్బులు పెట్టాలి. అప్పుడే నష్టపోకుండా లాభాలు అందుకోవచ్చు. అలాగే న్యూ ఫండ్ ఆఫర్ల విషయంలో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.
![]() |
![]() |