వెనెజులా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశం నుంచి చమురు కానీ, గ్యాస్ కానీ కొనుగోలు చేసే దేశాలపై తాము 25 శాతం పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. వెనెజులా నుంచి చివరిసారిగా జరిపిన కొనుగోలు నుంచి ఏడాది వరకు ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ తో పాటు చైనాపైనా ప్రభావం పడనుంది. వెనెజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. 2024 జనవరిలో ఆ దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల్లో మెజారిటీ వాటా భారతదేశానిదే. రోజుకు దాదాపు 2.5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. గతేడాది విదేశాల నుంచి కొనుగోలు చేసిన మొత్తం ముడి చమురులో 1.5 శాతం వెనెజులా నుంచే దిగుమతి చేసుకుంది. అలాగే చైనాకు కూడా రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా ఎగుమతి చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్ ల ప్రభావం భారత్, చైనాలపై పడనుంది.
![]() |
![]() |