2025 IPL లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా RCB vs CSK తలపడ్డాయి. 2008లో చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ చెపాక్ లో ఆర్సీబీ గెలవలేదు. అయితే నిన్న జరిగిన పోరులో చెన్నైపై 50 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. ముందుగా టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా బెంగుళూరు బాటింగ్ కి దిగింది ఫిల్ సాల్ట్- 32, విరాట్ కోహ్లీ- 31, దేవదత్ పడిక్కల్- 27 పరుగులు చేశారు. కేప్టెన్ రజత్ పటిదార్ టాప్ స్కోరర్. సారథిగా జట్టును ముందుండి నడిపించాడు. 32 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. సిక్సర్ల మోత మోగించాడు.
197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 16 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతను 3 ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. రచిన్ రవీంద్ర 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు, రవీంద్ర జడేజా 25 పరుగులు చేశాడు. జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు. యష్ దయాల్, లియామ్ లివింగ్‌స్టోన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఒక వికెట్ భువనేశ్వర్ ఖాతాలోకి వెళ్లింది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
![]() |
![]() |