భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కు భారత్ 'ఆపరేషన్ బ్రహ్మ' ను ప్రారంభించి, అత్యవసర సహాయం అందించింది. భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం సుమారు 15 టన్నుల సహాయ సామగ్రిని యాంగోన్‌లోని మయన్మార్ అధికారులకు అందించింది. ఈ సహాయ సామగ్రిలో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార ప్యాకెట్లు, హైజీన్ కిట్లు, జనరేటర్లు, అవసరమైన మందులు ఉన్నాయి.శుక్రవారం మధ్యాహ్నం శక్తివంతమైన భూకంపాలు కారణంగా మయన్మార్, బ్యాంకాక్ గజగజ వణికిపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 700 మంది చనిపోగా… వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.
![]() |
![]() |