ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పేదలకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన తొలి సంతకాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైలుపై చేశారు. ఈ నిర్ణయం ద్వారా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన 3,456 మంది పేదలకు లబ్ది చేకూరనుంది. ఇందుకోసం రూ.38 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలను ఆదుకున్నామని, బాధితుల వైద్యం కోసం రూ.281.38 కోట్లు అందించామని సీఎంవో వర్గాలు తెలిపాయి.
![]() |
![]() |