2025 IPL లో భాగంగా నేడు కోల్ కత్తానైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. కోల్ కత్తాలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు విజయాలు, అపజయాలు ఇలా పడుతూ లేస్తూ ఇప్పటి వరకూ ఐపీఎల్ సీజన్ లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. కోల్ కత్తానైట్ రైడర్స్ మూడు మ్యాచ్ లు ఇంత వరకూ ఆడి ఒక మ్యాచ్ లో గెలిచి రెండు మ్యాచ్ లో ఓడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అంతే. మూడు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో రెండు జట్లు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం నిరీక్షిస్తున్నాయి. రెండు బలమైన జట్లు కావడంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగే అవకాశముందన్న అంచనాలున్నాయి. అంతే కాదు ఈ రెండు టీం లకు ఇది రివెంజ్ మ్యాచ్.. ఎందుకంటే గత ఏడాది ఫైనల్ లో సన్ రైజర్స్ కోల్‌కాతా పై ఓటమి పాలైంది అంతే కాదు హర్షిత్ రానా ఫ్లైయింగ్ కిస్ కూడా ఒక వివాదం చూడాలి సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచి రివెంజ్ తీర్చుకుంటుందో లేదో..
![]() |
![]() |