ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎల్లప్పుడూ సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇదే కోవలో తాజాగా ఆయనకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. తనపై విధేయతను పెంచుకోవడానికి ప్రత్యేకంగా పిల్లలకు శిక్షణా తరగతులు సిద్ధం చేస్తున్నారట. ఈ విషయంలో పిల్లలకు శిక్షణ ఇచ్చే బోధకుల కోసం ఇటీవల ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ను నిర్వహించినట్లు సోమవారం అక్కడి మీడియా పేర్కొంది.బుధవారం నుంచి శనివారం వరకు దేశవ్యాప్తంగా ఉన్న బోధకుల కోసం పెద్ద ఎత్తున ప్యోంగ్యాంగ్‌లో ఈ వర్క్‌షాప్ జరిగిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ని ఉటంకిస్తూ యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది.'రెడ్ నెక్టీ' యూనిట్ అని పిలువబడే దేశవ్యాప్తంగా ఉన్న బాలల సంఘాన్ని సూచిస్తుంది. ఇందులో 7 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు చేరాలి. 1946లో స్థాపించబడిన ఈ యూనియన్‌లో 3 మిలియన్ల మంది సభ్యులు ఉంటారని అంచనా.ఇక ఈ కార్యక్రమం కిమ్ సూచనల మేరకు జరిగిందని, వర్క్‌షాప్‌లో ఆయన వ్యాఖ్యానించినట్లు కేసీఎన్ఏ తెలిపింది. అయితే, వివరాలు వెల్లడించలేదు."చిన్నప్పటి నుంచే సంస్థ విలువలను గౌరవించడం, తెలుసుకోవడం, దాని కార్యకలాపాల్లో స్వచ్ఛందంగా పాల్గొనడానికి అలవాటు పడటం పిల్లలకు నేర్పించాలి" అని వర్క్‌షాప్‌లో ఒక స్పీకర్ చెప్పినట్లు కేసీఎన్ఏ పేర్కొంది.
![]() |
![]() |