‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ విధానంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు విదేశాలపై ప్రతీకార టారిఫ్ లు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతయ్యే వాహనాలపై 25 శాతం పన్ను విధించిన ట్రంప్.. తాజాగా భారత్, చైనా సహా పలు దేశాలపై టారిఫ్ లు విధిస్తూ బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆదేశాలు జారీ చేశారు. భారత్ పై 26 శాతం, చైనాపై 34 శాతం పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికన్లకు వివిధ వస్తువుల ధరలు మరింత ప్రియంగా మారనున్నాయి. అమెరికాలో ధరలు పెరగనున్న వస్తువులు ఇవే.. కార్లు, దుస్తులు, షూస్, మద్యం, కాఫీ,అవకాడో, ఇంధన ధరలు.
![]() |
![]() |