మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈవీఎం నోడల్ అధికారి, డిప్యూటీ సీఈవో కె. వి. విశ్వేశ్వరరావు అండ్ టీం గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ స్వామి వారి నాగపుట్టలో పాలు పోసి వారి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు వారిని ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆర్డిఓ స్వాతి ఉన్నారు.