టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఈరోజు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో భద్రత, సౌకర్యం మరియు సౌలభ్యాన్ని పునర్నిర్వచించే ఫీచర్ అప్‌గ్రేడ్‌లను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్-ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు పొందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఇప్పటికే 1 లక్ష వాహనాల అమ్మకాల మైలురాయిని దాటింది. ఇది దాని వినూత్న సాంకేతికత, అసాధారణమైన ఇంధన సామర్ధ్యం, శక్తివంతమైన పనితీరు, ప్రీమియం డ్రైవింగ్ అనుభవంతో హృదయాలను గెలుచుకుంటూనే ఉంది.
అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లో ఇప్పుడు ప్రధానంగా మెరుగైన భద్రత ఫీచర్లు జోడించబడ్డాయి. ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇప్పుడు అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB) జోడించబడింది. సౌకర్యం కోసం 8-వే అడ్జస్టబుల్ పవర్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, క్యాబిన్ లోపల మెరుగైన గాలి నాణ్యత పర్యవేక్షణను నిర్ధారిస్తూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డిస్‌ప్లే జోడించబడింది.
![]() |
![]() |