భారత్ - ఈ సంవత్సరం, మొబిల్ డెల్వాక్™ బ్రాండ్ డీజిల్ ఇంజిన్ లూబ్రికేషన్‌లో ఒక శతాబ్దపు ఆవిష్కరణలను సూచిస్తూ తన 100వ వార్షికోత్సవాన్ని వేడుక చేసుకుంటోంది. ఇంజిన్ పనితీరు, ఎండ్యూరన్స్ పరిమితులను నిరంతరం ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించి మొబిల్ డెల్వాక్™ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఈ మైలురాయిని వేడుక చేసుకునేందుకు, తరాలుగా విశ్వసిస్తూ వచ్చిన కొనుగోలుదారులను, నిరంతరం కొత్త ప్రమాణాలను సృష్టిస్తూ వచ్చిన ఉద్యోగులను గౌరవించడానికి, మొబిల్ డెల్వాక్™ బృందం ఏడాది పొడవునా బ్రాండ్ చరిత్ర నుండి అత్యంత ముఖ్యమైన కథలను చాటిచెప్పనుంది. ఈ కథనాలు అవకాశాలను పునర్నిర్వచించిన మొబిల్ డెల్వాక్™ కొనుగోలుదారులు, ప్రపంచాన్ని అనుసంధానించిన విమానాలు, విప్లవాత్మక సూత్రాలను అభివృద్ధి చేసిన ఇంజనీర్లు మరియు అనేక ఇతర అంశాలను ప్రదర్శిస్తాయి.
"మొబిల్ డెల్వాక్™ ఉత్పత్తులు విశ్వసనీయతను అందించేలా రూపొందించబడ్డాయి, ప్రతిరోజూ పనితీరును అందిస్తాయి - వాటిపై ఆధారపడిన కొనుగోలుదారుల మాదిరిగానే", అని ఎక్సాన్ మొబిల్ లూబ్రికెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లూబ్రికెంట్స్ (సౌత్ ఏషియా పసిఫిక్) మార్కెటింగ్ డైరెక్టర్ చార్లీన్ పెరీరా అన్నారు. ‘‘100 సంవత్సరాల వారసత్వంతో, మొబిల్ డెల్వాక్™ ఈ మైలురాయిని దాని పరిశ్రమ నాయకత్వానికి నిద ర్శనంగా వేడుక చేసుకుంటోంది. ఈ విజయం రాబోయే సంవత్సరాల్లో పరిశ్రమలు సమర్థవంతంగా ముం దుకు సాగడం కోసం సరిహద్దులను అధిగమించడానికి, పురోగతిని నడిపించడానికి మాకు స్ఫూర్తి నిస్తుంది’’ అని అన్నారు.
![]() |
![]() |