ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందిపడ్డాడు.. మార్క్ శంకర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఈ ప్రమాదానికి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో పర్యటనను మధ్యలోనే ముగించుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నేతలు సూచించారు.
![]() |
![]() |