శ్రీరామనవమి పండుగ సందర్భంగా పాణ్యం మండలం నేరవాడ, పిన్నాపురం గ్రామాల్లో మంగళవారం కబడ్డీ పోటీలు, వృషభ రాజుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడాల్లో గెలుపుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రజలు పాల్గొన్నారు
![]() |
![]() |