అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు పరిస్థితులు అనుకూలంగా లేవు.అమెరికాలోని కొన్ని కళాశాలలు అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దుకు సంబంధించిన సంఘటనలు పెరుగుతున్నాయని ధృవీకరించాయి.భారతీయ విద్యార్థులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని తెలిపాయి. దీనికి తోడు, అమెరికాలో చదువుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. ట్యూషన్ ఫీజులు, వసతి ఖర్చులు, ఆహార ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.ఉద్యోగాల విషయంలోనూ నిరాశ ఎదురవుతోంది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా వచ్చాక మారిన పరిస్థితులు, కొత్త విధానాలు, కఠినమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల భారతీయ విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.భారత కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి, విద్యార్థులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
![]() |
![]() |