ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టబోయే బిడ్డను మేమే దత్తత తీసుకొొంటాం,,,,​ముస్కాన్ రస్తోగి గర్భంపై.. మృతుడి కుటుంబ సభ్యులు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 08:47 PM

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లాడిని భర్తనే అతికిరాతకంగా చంపి, మృతదేహాన్ని ముక్కలు చేసి ఆపై దాన్ని ఓ డ్రమ్ములో సీల్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రస్తుతం ముస్కాన్, ఆమె ప్రియుడు జైల్లో ఉన్నారు. ఈక్రమంలోనే ముస్కాన్ రస్తోగి గర్భం దాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తొలిసారి దీనిపై సౌరభ్ రాజ్‌పుత్ కుటుంబ సభ్యులు స్పందించారు. అలాగే పుట్టబోయే బిడ్డను ఏం చేయాలో కూడా చెప్పారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 27 ముస్కాన్ రస్తోగి.. మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2016లో పెళ్లి జరగా.. అతడు భార్య కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. ఈక్రమంలోనే వీరికి 2019లో పాపు పుట్టగా.. ఆ తర్వాత ముస్కాన్ రస్తోగి మరో యువకుడితో ప్రేమలో పడింది. ముఖ్యంగా తనకంటే రెండేళ్లు చిన్నవాడైన సాహిల్ తో వివాహేతర సంబంధం సాగించింది. ఈ విషయం సౌరభ్ రాజ్‌పుత్‌కు తెలిసినా బిడ్డ జీవితం నాశనం అవుతుందని ఏమీ అనలేదు. కానీ పాప పెరుగుతుండడం చూసి బాగా డబ్బులు సంపాదించాలని లండన్ వెళ్లిపోయాడు. ఈక్రమంలోనే ముస్కాన్ ప్రియుడికి మరింత దగ్గరైంది.


అయితే కూతురు పుట్టిన రోజు కోసం సౌరభ్ రాజ్‌పుత్‌ ఇంటికి రాగా.. మార్చి 4వ తేదీ రోజు ముస్కాన్ తన ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. ఆపై ప్రియుడితో కలిసి విహార యాత్రకు వెళ్లింది. కానీ ఈ విషయం వెలుగులోకి రావడంతో.. ముస్కాన్ సహా ఆమె ప్రియుడి సాహిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు జైల్లో ఉండగా.. డ్రగ్స్ కావాలని గొడవ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని.. వాటి కోసం తిండి కూడా తినట్లేదని చెప్పుకొచ్చారు. కనీసం మంచినీళ్లు కూడా తాగట్లేదన్నారు. అయితే అప్పుడప్పుడు సాహిల్‌ను చూసేందుకు ఆమె నానమ్మ అక్కడకు వస్తుండగా.. ముస్కాన్ కోసం ఎవరూ రావట్లేదని పోలీసులు స్పష్టం చేశారు.


ఇదంతా ఇలా ఉండగా.. ఈమధ్య ముస్కాన్ ఆరోగ్యం క్షీణించడంతో.. వైద్య పరీక్షలు చేయించారు. ఈక్రమంలోనే ఆమె గర్భం దాల్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయం వెలుగులోకి రాగా.. ముస్కాన్ ఎవరి వల్ల గర్భం దాల్చిందంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. తాజాగా దీనిపై మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ముస్కాన్ తన సోదరుడి వల్లే గర్భం దాలిస్తే.. ఆ బిడ్డను తామే దత్తత తీసుకుంటామని సౌరభ్ సోదరుడు బబ్లూ రాజ్‌పుత్ చెప్పారు. ఆ బిడ్డను పెంచుకోవడం తమ అందరికీ ఇష్టమేనని వెల్లడించారు. కానీ దీనిపై ముస్కాన్ తల్లిదండ్రులు ఇప్పటి వరకు స్పందించలేదు.


ముస్కాన్ గర్భం దాల్చిన విషయం ఆమెకు తెలుసా అని వైద్యుడిని ప్రశ్నించగా.. తెలుసో లేదో తనకు తెలియదన్నారు. నిబంధనలు ప్రకారం అయితే అల్ట్రా సౌండ్ టెస్ట్ చేశాకే అధికారికంగా ఆమెకు ఈ విషయాన్ని తెలియజేస్తారన్నారు. మరికొన్ని రోజుల్లోనే అల్ట్రా సౌండ్ పరీక్ష చేస్తామని.. అప్పుడే ఆమె ఎన్ని వారాల గర్భవతి, లోపల బిడ్డ ఎలా ఉందో వివరిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa