మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)వారం ప్రారంభంలో నూతన మిత్రత్వాలు, స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఇంతకుముందు ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. బకాయి పడిన పాత రుణములు అందుకుంటారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వారం మధ్యలోతండ్రి యొక్క ఆరోగ్యం ఆలోచన చేస్తారు, మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశం ఉంది, మధ్యవర్తిత్వం పనికిరాదు, ఆర్థికవిషయాలు, ప్రయాణాలు,పరిచయాలు విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారం చివరిలోపలుకుబడి కలిగిన ఉన్నతాధికారులు ద్వారా సహకారాన్ని ఆశిస్తారు, కొత్త పరిచయాలతో మోసానికి లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. వృత్తి విషయంలో ఎక్కువ ఒత్తిడి లోనవుతారు, విద్యార్థులు విద్య మీద తగిన శ్రద్ధ చూపించాలి. మీ ఆలోచనలు సంతానపరమైన విషయాల పై ఎక్కువ ఫోకస్ చేస్తారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది,సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే శ్లోకాన్ని పఠించాలి.
వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
వారం ప్రారంభంలో కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆగిన పనులు పూర్తి చేయడానికి సంకల్పం తీసుకుంటారు, వృత్తిలో వ్యక్తుల స్వార్థపూరితమైన మనస్తత్వం మీకు చికాకును కలిగిస్తుంది. ఒత్తిడిని, నిద్రలేమిని కలిగిస్తూ సహనాన్ని కోల్పోయేలా చేస్తాయి. వృత్తి సంతానము సంబంధించిన అంశాలు వృత్తిపరంగా నూతన వ్యక్తులను కలుస్తారు గౌరవం పెరుగుతుంది, ఆధ్యాత్మిక వృత్తికి నూతన అవకాశాలు ఆధ్యాత్మిక ఆలోచనలు. ప్రయాణాల సంకల్పం. మిత్రులను బంధువుల్ని కలుస్తారు. భాగస్వామితో కలిసి కొన్ని నిర్ణయాలు వృత్తికి సంబంధించి, సంతాన అభివృద్ధికి సంబంధించి గట్టిగా తీసుకుంటారు. వారం చివరిలో శారీరక మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, ముఖ్యమైన విషయాలు ఆటంకాలు, శ్రమ తిరుగుడు, అధిక ఖర్చు మనశ్శాంతి లోపం. ఆలోచనలు పెరుగుతాయి, సంతృప్తి తగ్గుతుంది. ఇష్టం లేని విషయాలు వినవలసి వస్తుంది. నూతన వాహన, గృహ అంశాల మీద ఆలోచనలు. తోబుట్టువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.తండ్రి గారి ఆరోగ్యం కూడా శ్రద్ధ తీసుకుంటారు. ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ రాజ మాతాంగియై నమః శ్లోకము మేలు.
మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి) ఈ రాశి వారికి వారం ప్రారంభంలోఆరోగ్య శ్రద్ధ అవసరము రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు సంతానము వారి వృద్ధిపై మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది అధిక ఆలోచనలు చికాకును కలిగిస్తాయి. నూతన దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, భూ సంబంధ అంశాల కొరకు తల్లితండ్రులను సంప్రదిస్తూ ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య విషయాని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్యులను సంప్రదించటం మేలు. భాగస్వామ్య వ్యవహారాల్లో రుణముల విషయంలో ఆకస్మిక ఖర్చులు. వారం మధ్యలో జీవిత భాగస్వామితో కలిసి రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తారు నూతన మిత్రులు, సమావేశాలు. వారం చివరిలో వృత్తి సంబంధించిన అంశాలు, తోబుట్టువులతో చర్చలు,ఒత్తిడి అలసట. శ్రీరామ జయ రామ జయజయ రామ శ్లోకము మేలు
కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)వారం ప్రారంభంలో సంతాన అభివృద్ధి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసు కుంటారు. వారి ఆరోగ్య విషయంలో, వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలలో కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన గృహ వాహనవిషయాలు, తల్లిఆరోగ్యం, స్థిరాస్తులు, విద్యార్థులకు విద్యాసంబంధ విషయాలు, అనుకూలంగా ఉంటాయి. ఆలస్యంగా నైనా మీ ఆలోచనలుఫలిస్తాయి, అన్నదమ్ములతో, ముఖ్యంగా ఆత్మీయ మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారం చివరిలో వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటూ వైరాగ్యపు ఆలోచనలని, నూతన పరిచయాల్లో, ఆత్మీయ సంబంధాల్లో అపార్ధాలుని అధిగమిస్తూ ముందుకు వెళ్లాలి. రుణాలు చెల్లిస్తారు శత్రువుల మీద విజయం సాధిస్తారు నైపుణ్యాలు పెంచుకుంటారు. నూతన వృత్తులకు అవకాశాలు. అయినప్పటికీ భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వరాహాయ ధరన్యుద్దారకాయ శ్లోకము మేలు
సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
వారం ప్రారంభంలో కొలీగ్స్, క్రింద పనిచేసే వ్యక్తులు కొంతవరకు సహకరిస్తారు, మాటలతో అపార్ధాలు రాకుండా చాకచక్యంగా వ్యవహరించాలినిర్ణయి సామర్థ్యం బాగుంటుంది, వృత్తిపరమైన బాధ్యత పెరుగుతుంది. తోబుట్టువులని సంప్రదిస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో క్రొత్త ఆలోచనలు శ్రీకారం చుడతారు. వృత్తి చేయు ప్రదేశంలో వాహన సంబంధం అయిన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. గృహ వాహన స్థిరాస్తి సంబంధ అంశాలు చర్చకి వస్తాయి.మానసిక ప్రశాంతత సామాన్యంగా ఉంటుంది. ఆలోచనలు సృజనాత్మకంగా లాభసాటిగా ఉంటాయి సంతానము అభివృద్ధి కరంగా ముందుకు వెళతారు. తల్లి ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థుల శ్రమ అనుకూలంగా ఉంటుంది విషయాలు నేర్చుకుంటారు సమయానికి ఆహార స్వీకరణ చేస్తారు .వారం చివరిలోశత్రువుల మీద .విజయంసాధిస్తారురుణములు చెల్లిస్తారు. నైపుణ్యాలు పెరుగుతాయి. ఆధ్యాత్మికచింతన, ప్రవచనాలు, ఆధ్యాత్మిక కలయిక, ఆశీస్సులు అనుకూలంగా ఉంటాయి.శుభవార్తలు. ఆపదామపహర్తారాందాతారాం సర్వసంపదం శ్లోకము మేలు
కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
వారం ప్రారంభంలో జీవిత భాగస్వామి సంతానంతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వాతావరణ కొంచెం చికాకుగా ఘర్షణగా ఉంటుంది. మాటల వల్ల అపార్ధాలకు అవకాశం ఉంది శ్రద్ధ తీసుకోవాలి అనుకోని శత్రుత్వాలు చికాకును కలిగిస్తాయి. అనవసర ఆటంకాలతోపెట్టుకున్నపనులు, ప్రయాణాలు ముందుకు సాగవు. వారం మధ్యలో సామర్థ్యాలు పెరిగిన శక్తి మించి కృషి చేసిన ఇరుగుపొరుగు, తోబుట్టువులతో కొంత ఘర్షణాత్మకమైన అవకాశాలు అపార్ధాలు అధికంగా ఉంటాయి. డ్రైవింగ్ చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి వాహన విషయంలో గృహం విషయంలో చికాకులు అధిక మొత్తంలో ఉంటాయి. వాటికి సంబంధించి అధిక అనవసరమైన ఖర్చులు తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తాయి. ప్రశాంతత లోపిస్తుంది. వారాంతంలో కొనుగోలులో, గృహ వాహన ఖర్చుల విషయంలో స్వార్థపూరితమైన కొత్త వ్యక్తుల స్నేహ సంబంధాలు, మోసాలు ప్రలోభాలు మొదలైన వాటికి లొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.విందువినోదాలు, షాపింగులు, సంతానము జీవిత భాగస్వామితోనూ చర్చలు. ఉన్నతాధికారులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక: శ్లోకం మేలు
తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
వారం ప్రారంభంలో రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో, మీ నైపుణ్యాలతో అధిగమిస్తారు. సంతాన సంబంధం అభివృద్ధి కొరకు, భాగస్వామ్య వ్యవహారాలకు ఉద్వేగాలు లేకుండా నిదానంగా వ్యవహరించి పనులు సాధించుకోవాలి. ఆరోగ్య విషయంలో, వ్యక్తిగత అంశాలలో తగిన శ్రద్ధ అవసరం, అనవసర ఖర్చులు నియంత్రించుకో గలగాలి. జాగ్రత్తగా మాట్లాడుతూ, గౌరవం తగ్గకుండా, ఖర్చులు చేస్తూ, కుటుంబ సభ్యులతో వివాదములు రాకుండా ముందుకు వెళ్లాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకదానికి అనుకున్న ఖర్చు మరొక దానికి అవ్వడం వల్ల కొంత చికాకులు ఉంటాయి. సామర్థ్యం పెరుగుతుంది. శ్రమతో పనులు సాధించుకుంటారు. ప్రశాంతత కొంత తగ్గుతుంది, విద్యార్థులు విద్య మీద దృష్టి సారించాలి, వాహనాల నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, గృహ వాహన విషయాలలో పెట్టుబడులు ఆలోచనలు చేస్తారు.మీ క్రింద పని చేసేవారు సమయానికి సహకరించ పోవడం వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ దాని అధిగమించగలరు. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ శ్లోకము మేలు
వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు) ఈ రాశి వారికి వారం ప్రారంభంలోనూతన పరిచయాలు స్నేహ సంబంధాలు మొదలైన వాటికోసం ఖర్చులుచేస్తారు. భాగస్వామితో కలిపి కొత్త ఆలోచనలు చేస్తారు దీర్ఘకాలికి పెట్టుబడుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొంత నిద్రలేమి చికాకును కలిగిస్తుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి పౌరుషంగా తీసుకుంటారు. పుణ్యాలు పెంచుకుంటూ శత్రువుల మీద విజయం సాధిస్తారు. లాభదాయకమైన నిర్ణయాలతో ముందుకు సాగుతారు. విదేశాలలో ఉన్న సంతానము అభివృద్ధి కరంగా ఉంటుంది ఇష్టపడిన వ్యక్తులతో వాతావరణం సామాన్యంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామికి ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది, వారం చివరిలోఅత్తవారి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. దూర ప్రదేశాలలో ఉన్న తోబుట్టువులతో, ఉన్నత అధికారులతో అభిప్రాయ బేధాలు రాకుండా వ్యవహరించాలి. గణేష్ దేవాలయాలు సందర్శన మేలు
ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)వారం ప్రారంభంలో స్థిరాస్తుల కొరకు చర్చలు. గృహ వాహనాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ బాగుంటుంది. మిత్రులు సన్నిహితులు సహకరిస్తారు మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు సంబంధించిన అంశాలు ముందుకు సాగుతాయి. ఆగిన పనులు, వారం మధ్యలో పని ఒత్తిడితో భారం అధికంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడినవి చేస్తూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేయాలి, నూతన వృత్తులు కొరకు ప్రయత్నం చేసే వారికి దూర ప్రదేశాల్లో అవకాశాలు, ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రుణములు చెల్లిస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అసంతృప్తిని జయించే విధంగా ఆలోచనలు చేయాలి. వారం చివరిలోమాటలు, ఖర్చులు మొదలైన వాటిలో జాగ్రత్త అవసరం. వాగ్దానాలు వల్ల, ఆర్థిక విషయాలలో, కుటుంబ సంబంధ వ్యవహారాలు, మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. శ్రీరామ జయరామజయజయరామరామ శ్లోకం మేలు.
మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
వారం ప్రారంభంలో వృత్తిపరమైన అంశాలలో బాధ్యతలు శ్రమ అధికంగా ఉంటాయి మీ ఆలోచనలు నైపుణ్యాలు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటాయి. కమ్యూనికేషన్ విషయములలో జాగ్రత్తలు అవసరం. వ్యక్తుల సహకారం కొంత ఉండడం వల్ల ప్రశాంతత కూడా తక్కువగా ఉంటుంది. వారం మధ్యలో మీ ఆలోచనలు ఫలిస్తాయి, సంతానం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది, ఆత్మీయులైన వ్యక్తులతో అభిప్రాయ బేధాలు లేకుండా ముందుకు పెడతారు. ఆర్థిక సంబంధమైన, భూ సంబంధ విషయాలు అనుకూలం. తండ్రి సహకారం బాగుంటుంది. సంతాన సంబంధ అంశాలలో అభివృద్ధి విషయాలలో పెట్టుబడులు. ఉపాసన బలం పెంచుకుంటారు ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ఇష్టమైన వస్తువులపై ఖర్చులు అధికంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. వారం చివరిలో తల్లి జీవిత భాగస్వామి మొదలైన ఆత్మీయమైన వ్యక్తులతో అపార్థాలకు దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తుల విషయంలో కొత్త పెట్టుబడుల విషయంలో మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః: శ్లోకము మేలు
కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా) వారం ప్రారంభంలో ఆధ్యాత్మిక విషయాలలో మిత్రులు కొలీగ్స్ తో కలసి దగ్గర ప్రయాణాలు, పెద్దలు గురువులను కలుస్తారు వారి ఆశీస్సులు తీసుకుంటారు. కుటుంబంలో కార్యక్రమ కొరకు తండ్రి ఆర్థిక సహకారంతో ముందుకు వెళతారు. తల్లిదండ్రుల సౌకర్యం కొరకు వారి ఆరోగ్యము పై ఆలోచనలు అధికం చేస్తారు, వృత్తిపరమైన విషయాల్లో బాధ్యతలు అధికంగా ఉంటాయి. శ్రమపడినా శ్రమకి తగిన గౌరవం, ఆర్థిక లాభాలు అన్నప్పటికీ వ్యక్తులతో విభేదాలు అభిప్రాయ బేధాలు రాకుండా ముందుకు సాగాలి. వృత్తిపరమైన అంశాలలో ఆలస్యాలు ఆటంకాలు వాహన సంబంధమైన విషయాలు ఇబ్బందులు కలిగించినప్పటికీ కుటుంబ వాతావరణం సామాన్యంగా ఉంటుంది. వారం చివరిలో గృహ వాహన విషయాలు కొంత సంతృప్తికరంగా సాగుతాయి. జీవిత భాగస్వామికి బహుమానాలు, కుటుంబంలోని స్త్రీలతో సఖ్యత, అధిక ఖర్చులు, ఆలోచనలు బాగుంటాయి. తోబుట్టువులు మిత్రులతో కలిపి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లి కుటుంబ సభ్యులతో కలిపి సమావేశాలు చర్చలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆహార స్వీకరణ, ఆరోగ్య సంబంధ అంశాలలో జాగ్రత్తలు అవసరం. క్రీమ్ అచ్యుతానంద గోవిందా జపించాలి.
మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)రాశి వారికి వారం ప్రారంభంలోవిద్యాపరమైన విషయాలలో దూర ప్రయాణాలు, విదేశీ విద్య మిత్రుల ప్రోత్సాహంతో ముందుకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యములో జాగర్తలు. కమ్యూనికేషన్, ప్రయాణాలువిషయంలోఇబ్బందులు, ముఖ్యమైన ఆత్మీయులైన వ్యక్తులు అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆకస్మిక లాభాలు సమానంగా అనవసరమైన ఖర్చులు చికాకునుకలిగిస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు గౌరవం, సామాజిక సేవ చేస్తారు. వృత్తి సంబంధమైన విషయాలు కొంత ఒత్తిడితో కూడిన గౌరవాన్ని, అధిక బాధ్యతల్ని తెస్తుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో ఉద్వేగాలకు లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ అవసరము. నూతన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు విద్యాసంబంధమైన విషయాలు కొంత శ్రమతో విజయ సాధన కొరకు ఉపయోగంగా కనబడతాయి. వారం చివరిలో ఆర్థిక విషయాలు లాభకరంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల బహుమానాలు అందుకుంటారు. వృత్తిలో శ్రమ పెరుగుతుంది.వ్యక్తుల సహకారం బాగుంటుంది, మంచి ఫలితములకై వృత్తికి శ్రీ రాజమాతాం గ్యేయనమః మేలు.
గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
![]() |
![]() |