దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే.. సోమవారం స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 150 తగ్గి.. రూ.87,550 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 160 తగ్గడంతో.. రూ. 95,510 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 100 తగ్గి.. 1,09,900 గా కొనసాగుతుంది.బంగారు ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారెట్స్ బంగారం ధర ఎంత ఉంది అనేది చాలా మందికి అవసరం. మరి, ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 87,550 ఉంది. అయితే గత వారం ఇదే బంగారం ధర రూ. 87,700గా ఉంది. అయితే మెుత్తంగా 150 రూపాయలు తగ్గింది.వెండి ధర పెరిగిందా? లేక తగ్గిందా?: గత 4 రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి కూడా ఈ రోజు తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్ 12న 100 గ్రాముల వెండి ధర 11,000 గా ఉంటే... ఈ రోజు 10,990గా ఉంది. ఇది పెళ్లిళ్ల టైం కాబట్టి వెండికి కూడా ఈ రోజుల్లో డిమాండ్ పెరుగుతుంది. ధర కూడా పెరిగేస్తుంది.
![]() |
![]() |