కోటవురట్ల మండలం కైలాసపట్నం వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రమాదం నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి సోమవారం సాయంత్రం పరిశీలించారు. డీఎస్పీతో పాటు చోడవరం సిఐ, ఫైర్ రెవెన్యూ అధికారులు చోడవరం మండలంలో ఉన్న బానసంచ తయారీ కేంద్రాల వద్ద ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
![]() |
![]() |