ఢిల్లీ యూనివర్సిటీలోని ఓ కళాశాల ప్రిన్సిపల్ వేసవిలో చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో తరగతి గదుల గోడలపై పశువుల పేడతో అలికారు. సంప్రదాయ పద్ధతుల్లో భాగంగా ఇది గదుల్లో వేడిని తగ్గించి, చల్లదనం కలిగిస్తుందన్న నమ్మకంతో ఈ చర్య తీసుకున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా వినియోగించే ఈ పద్ధతిని విద్యాసంస్థల్లో అమలు చేయడంపై కొన్ని వర్గాలు ప్రశంసించగా, మరికొందరు శుభ్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.చిత్రంగా ఉన్నప్పటికీ.. నిజం. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో.. ఢిల్లీలోనే ఉన్న ఝన్సీలక్ష్మీబాయి కాలేజీలో ఈ ఘన కార్యం జరిగింది. సాక్షాత్తూ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రత్యూష వత్సల.. కాలేజీలోని తరగతి గదుల లోపలి గోడలకు రైతుల నుంచి సేకరించిన.. ఆవు పేడను ముద్దలు ముద్దలుగాతీసుకుని స్వయంగా అలికారు. దీనికిగాను ఆమె ఉపాధ్యాయులను కూడా ఆదేశించారు. కానీ, వారు రాబోమని నిరసన వ్యక్తం చేయడంతో స్వయంగా ప్రిన్సిపాలే రంగంలోకి దిగారు.
![]() |
![]() |