ప్రతి 10 మందిలో ఒకరు తమ జీవితకాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ రీసెర్చ్‌లో వెల్లడైంది. "ఈ సమస్య 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో సర్వసాధారణంగా ఉండవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు వస్తే నడుము దిగువ భాగంలో, ఉదరంలో లేదా ఉదరంలోని ఒక వైపున నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పి నడుము నుంచి చంకల వరకు వ్యాపించినట్లు అనిపిస్తుంది." అని పరిశోధనలో తేలింది.అధ్యయనంలో భాగంగా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న పలువురు రోగుల నుంచి రక్తం, మూత్రం, కిడ్నీ రాళ్ల శాంపిల్స్‌ను సేకరించారు. ఆయా రోగుల రక్తం, మూత్రం, కిడ్నీ రాళ్లలో ఏయే మూలకాలు ఎంత మోతాదులో ఉన్నాయనేది పరిశోధకులు పోల్చి చూశారు. కిడ్నీలో రాళ్లు కలిగిన వారి నుంచి ఈ మూడు రకాల సమాచారాన్ని ఏకకాలంలో సేకరించి రీసెర్చ్ చేయడం ఇదే తొలిసారి అని సైంటిస్టులు తెలిపారు. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీసిన ప్రధాన కారకాన్ని గుర్తించే వీలుంటుందని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ఎయిమ్స్‌లోని యూరాలజీ విభాగం, అనాటమీ విభాగం, లేబొరేటరీ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ ఛబ్రా స్వేషా, డాక్టర్ సేథ్ అమ్లేష్, డాక్టర్ అహ్మదుల్లా షరీఫ్, డాక్టర్ జావేద్ అహ్సాన్ ఖాద్రీ, డాక్టర్ శ్యామ్ ప్రకాష్, డాక్టర్ కుమార్ సంజయ్ భాగమయ్యారు.
![]() |
![]() |