యూపీలోని బహరైచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన పలువురు తమ బంధువు ఇంట్లో శుభకార్యం ఉండడంతో ఆటోలో హీరాపూర్ నుంచి కోలుహ్వా గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో గోండా-బహరైచ్ రహదారిపై ఓ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |