టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి టెస్టుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు 7 చేసిన ఆటగాడిగా నిలిచారు. కోహ్లి తర్వాత స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్ 6, సచిన్ 6, ద్రవిడ్ 5, గవాస్కర్ 4, పుజారా 3 ఉన్నారు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 254. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత కెప్టెన్ కోహ్లినే.‘‘14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్టు క్రికెట్ జెర్సీ ధరించా. ఈ ఫార్మాట్ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించింది. తెల్ల జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా నా మనసుకు చాలా ప్రత్యేకమైనది. నిశ్శబ్దమైన ఆనందం.. సుదీర్ఘమైన రోజులు.. ఎవరికీ కన్పించని చిన్న చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి’’‘‘అలాంటి ఈ ఫార్మాట్ నుంచి దూరం జరగడం అంత తేలిక కాదు. కానీ, నా నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. ఈ ఫార్మాట్ కోసం నేను ఎంతో ఇచ్చా. నేను ఆశించిన దాని కంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో దీన్ని నుంచి వైదొలుగుతున్నా. వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్..’’ అని కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు.
![]() |
![]() |