హిందూపురం పట్టణంలో విద్యా అభివృద్ధికి అనుకూలంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని పిడిఎస్యు జిల్లా కార్యదర్శి బాబావలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూపురం జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్య తక్కువగా ఉందని, ముఖ్యంగా ఉర్దూ భాషను ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థులకు జూనియర్ కళాశాల లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి, విద్యార్థుల భవిష్యత్‌కు దోహదపడేలా హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు, ఉర్దూ మీడియంలో చదువుకునే వారికి ప్రత్యేకంగా ఉర్దూ జూనియర్ కళాశాలను కూడా ప్రారంభించాలని బాబావలి కోరారు. విద్యా అవకాశాల విస్తరణకు ఇది అనివార్యమని, ప్రభుత్వమే ముందడుగు వేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
![]() |
![]() |