ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై చంద్రశేఖర్ (32) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబం చేపల చెరువుకు కాపలాగా ఉంటోంది. అదే ప్రాంతంలో మరో చేపల చెరువుకు శ్రీకాళహస్తికి చెందిన చంద్రశేఖర్ కాపలా కాస్తున్నాడు.
నిందితుడు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బాలిక ముఖంపై గాయాలను గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించగా, ఆమె జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |