సండే వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో చికెన్ వండుకుంటారు. కొంతమంది మటన్ కూడా ప్రిఫర్ చేస్తారు. వీటితో పాటు చేపల్ని తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే, చేపల్ని సరైన విధానంలోనే తినాలి. లేదంటే సమస్యలొస్తాయి. ముఖ్యంగా పెరుగుతో కలిపి అస్సలే తినకూడదని చెబుతారు. దీని వల్ల సోరియాసిస్, ఎగ్జిమాతో పాటు జీర్ణ సమస్యలొస్తాయని చెబుతారు. మరికొంతమంది ఏం పర్లేదు పెరుగుతో కలిపి కూడా తినొచ్చు. ఎలాంటి సమస్యలు రావని చెబుతారు. ఈ రెండు వాదనల్లో ఏది నిజమో అనే విషయాన్ని హోమియో డాక్టర్ శ్వేత తెలియజేస్తున్నారు.
చేపల్ని పెరుగుతో కలిపి తింటే
చాలా మంది చేపల్ని వండేటప్పుడు మారినేట్ చేస్తారు. అప్పుడు పెరుగు కూడా వేసి కలుపుతారు. అంతేకాకుండా వండేటప్పుడు రుచిగా ఉంటుందని పెరుగు వేస్తారు. బెంగాల్‌లో ఉన్నవారికి ఇది అలవాటే. మరికొంతమంది చేపల్ని తిన్నాక పెరుగన్నం తింటారు. ఇలా చేయకూడదు, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటూ ఓ వాదన ఉంది.
ఆరోగ్య సమస్యలు
చేపలు, పెరుగుని కలిపి తీసుకుంటే చర్మ సమస్యలైన సోరియాసిస్, ఎగ్జిమా వస్తుందని, అంతేకాకుండా గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ వంటి జీర్ణ సమస్యలొస్తాయని చెబుతారు. దీని గురించి డాక్టర్ శ్వేత ఏమంటున్నారంటే
డాక్టర్ శ్వేత ప్రకారం
ఆయుర్వేదంలో చేపని ప్రోటీన్ సోర్స్‌గా చూస్తారు. దీనిని తీసుకుంటే బాడీలో వేడి పెరుగుతుంది. ఇక పెరుగుని శీతలం అంటే దీనిని తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. ఇలా రెండింటిని కలిపి తినడం వల్ల కడుపులో సమస్యలొస్తాయని చెబుతున్నారు డాక్టర్. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని, వీటిని తీసుకున్నప్పుడు మీ కడుపులో గ్యాస్, బ్లోటింగ్ అజీర్ణం వంటి సమస్యలు వస్తే మానేయాలని, లేదంటే ఈ కాంబినేషన్‌ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు డాక్టర్.
కొంతమందికి పెరుగు, చేపలు ఈ రెండింటిలో ఏది పడకపోయినా సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు సమస్య వస్తే రెండింటి కాంబినేషన్‌తో వచ్చిందా లేదా విడివిడిగానే మనకి ఆ ఫుడ్ పడదా అని గుర్తించి తీసుకోవాలి.
![]() |
![]() |