టిబెట్‌లో ఆదివారం రెండుసార్లు భూమి కంపించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. మొదటి భూకంపం 3.8 తీవ్రతతో మధ్యాహ్నం 1:14 గంటలకు సంభవించగా, రెండోసారి సాయంత్రం 5:07 గంటలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 3.7గా నమోదైందని అధికారులు వెల్లడించారు. టిబెటన్ పీఠభూమి ప్రాంతం భూకంపాలకు నిలయంగా ఉంటుందని, టెక్టోనిక్ ప్లేట్ల కదలికల కారణంగా ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తాయని భౌగోళిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. తాజా భూకంపాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
![]() |
![]() |