దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాల్లో పార్టీ రాజకీయాలను పక్కన పెట్టాలని ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు పంపుతున్న ప్రతినిధి బృందాలను బహిష్కరించాలన్న శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ పిలుపుపై ఆయన స్పందించారు.పహల్గామ్ దాడి, అనంతరం పాకిస్థాన్ చేపడుతున్న కార్యకలాపాల నేపథ్యంలో, ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపుతోంది. అయితే, ఈ బృందాలు ప్రభుత్వ 'పాపాలు, నేరాల'ను సమర్థించడానికి వెళుతున్నాయని ఆరోపిస్తూ, ఇండియా కూటమిలోని పార్టీలు ఈ పర్యటనలను బహిష్కరించాలని సంజయ్ రౌత్ ఆదివారం పిలుపునిచ్చారు.సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ, "అంతర్జాతీయ సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీల మధ్య రాజకీయాలను పక్కన పెట్టాలి. ప్రస్తుతం కేంద్రం కొన్ని ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. కొన్ని దేశాలకు వెళ్లి పహల్గామ్ దాడి, పాకిస్థాన్ కార్యకలాపాలపై మన దేశ వాదనను వినిపించే బాధ్యతను వారికి అప్పగించింది" అని అన్నారు.
![]() |
![]() |