సునీల్ గవాస్కర్, భారత జట్టు ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) విజేతగా నిలవడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు దక్కాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని, దీనికి అప్పట్లో కేకేఆర్ మెంటార్‌గా ఉన్న గంభీరే పరోక్ష కారణమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.వివరాల్లోకి వెళితే, గత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ విజయంలో అయ్యర్ కెప్టెన్సీ కన్నా, అప్పటి మెంటార్ గౌతమ్ గంభీర్ వ్యూహాలకే ఎక్కువ ప్రశంసలు దక్కాయని పలువురు భావించారు. ఇదే విషయంపై తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ సునీల్ గవాస్కర్ స్పందించారు. "గత సీజన్ ఐపీఎల్ విజయంలో అతనికి (శ్రేయస్ అయ్యర్‌కు) సరైన క్రెడిట్ లభించలేదు. ప్రశంసలన్నీ వేరొకరికి (గంభీర్‌కు) దక్కాయి. మైదానంలో ఏం జరగాలో, వ్యూహాలు ఎలా అమలు చేయాలో నిర్ణయించడంలో కెప్టెన్ పాత్రే కీలకం. డగౌట్‌లో కూర్చున్న వ్యక్తిది కాదు కదా" అని గవాస్కర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
![]() |
![]() |