కేఎల్ రాహుల్‌పై తరచూ వినిపించే విమర్శలు తనకు చాలా అసాధారణంగా అనిపిస్తాయని ఐపీఎల్ మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అన్నారు. రాహుల్ అద్భుతమైన ఆటగాడని, అతనికి దక్కాల్సినంతగా గుర్తింపు రావడం లేదని అభిప్రాయపడ్డారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో టామ్ మూడీ రాహుల్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు."కేఎల్ రాహుల్ చుట్టూ అల్లుకున్న విమర్శలు ఎప్పుడూ నాకు వింతగా అనిపిస్తాయి. చాలా మంది అనుకుంటున్న దానికంటే అతను గొప్ప ఆటగాడని నేను భావిస్తాను" అని టామ్ మూడీ పేర్కొన్నారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని, అతని సెంచరీ కారణంగానే ఢిల్లీ జట్టు 200 పరుగుల స్కోరు చేయగలిగిందని తెలిపారు. "నిజానికి ఢిల్లీ జట్టు 220 పరుగులు చేయాల్సింది. ఆ అవకాశం ఉన్నా దాన్ని అందుకోలేకపోయారు. అయితే, క్రికెట్ అనేది వ్యక్తిగత ప్రదర్శనలతో ముడిపడిన ఆట కాదు, ఇది పూర్తిగా జట్టు సమష్టితత్వంతో ఆడేది" అని మూడీ విశ్లేషించారు.
![]() |
![]() |