కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక, బలమని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కనిగిరిలోని బ్రహ్మరెడ్డి కల్యాణ మండపంలో సోమవారం జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టిన తొలి పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
![]() |
![]() |